Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Jul 29, 2026Short Read
శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు!
క్విక్ టుడే న్యూస్, జులై 29 :- ఎగువ రాష్ట్రాలైన కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండటంతో కృష్ణమ్మ దిగువన ఉన్న శ్రీశైలం వైపు పరవళ్లు తొక్కుతోంది.
ఈ జలాశయాల నుంచి 80వేల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేశారు.దీంతో తెలంగాణలోని గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టుకు కృష్ణా నీరు చేరుతోంది.
జూరాల విద్యుత్ కేంద్రం నుంచి 37వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
ఈ ప్రవాహం ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Subscribe to Our Newsletter
Get the latest news delivered to your inbox.


